‘Bro’ Making Video :
పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం ఉంటుందో అందరికి ఒక అంచనా అనేది ఉంటుంది.. ఈయన క్రేజ్ మరోసారి ‘బ్రో’ సినిమా రూపంలో బయట పడింది.. పవర్ స్టార్ ఫుల్ మూవీ కాకపోయిన ఈయన ఉండే అరగంట సమయానికే ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ క్రేజ్ పెంచుకున్నారు. ఈ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ తో ఈ మూవీ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కండేయ రిలీజ్ కాగా ఇది మరో లెవల్ కు చేర్చింది. టీజర్ నుండి లిరికల్ సాంగ్ వరకు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూడడం స్టార్ట్ చేసారు..
ఈ సినిమాలో పవర్ స్టార్ వింటేజ్ లుక్ మరింత ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచేశారు.. జులై 15న సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ లోపులోనే మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. మై డియర్ మార్కండేయ సాంగ్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా ఇది ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్, సాయి తేజ తో ఫన్నీగా డ్యాన్స్ వేయడం అల్లరి చేయడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే సాయి తేజ్, పవన్ మధ్య సన్నివేశాలు మ్యాజిక్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉండడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ముందే రాసిపెట్టుకున్నారు ఫ్యాన్స్..