జీవితం అంటే ఆటలు కాదు. సమయం వృథా చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీజర్ విడుదలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మామా అల్లుళ్ల సంభాషణలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయనడంలో సందేహం లేదు. వీరిద్దరి నటన చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మెగా అభిమానులకు పండగే. పవన్ కల్యాణ్ అంటేనే వారికో పిచ్చి.
టీజర్ ఒక నిమిషమే ఉంది. అందులో వీరి మాటలే ఉన్నాయి. పవన్, సాయిల నటన ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. కారులో ప్రయాణం చేసేటప్పుడు వీరి సంభాషణలు బాగున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేసన్ లో ఇదివరకు సినిమా రాలేదు. దీంతో వీరి జోడి ఎలా ఉంటుందోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
దర్శకుడు సముద్ర ఖని సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మాటలు త్రివిక్రమ్ రాశారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందుకే సినిమాపై అందరికి అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా ఎప్పుడు చూడాలనే ఆతృత అభిమానుల్లో ఎదురవుతోంది.
ReplyForward
|