40.1 C
India
Friday, April 19, 2024
More

    Bro Poster : బ్రో నుండి మామ అల్లుడి పోస్టర్.. పవన్ – తేజ్ లుక్స్ అదిరిపోయాయిగా!

    Date:

    Bro poster
    Bro poster

    Bro poster : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఒక సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసుకుని న్న ఈ సినిమా అప్పుడే పూర్తి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది.

    ఎటువంటి గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేయడంతో చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే కేటాయించగా ఆ సమయంలోనే ఈయన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఇందులో పవన్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు.. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.

    ఇక ఇటీవలే ఈ సినిమా టైటిల్ అండ్ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇండియాలో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్ గా పవర్ స్టార్ సరికొత్త ట్రెండ్ సృష్టించాడు.. ఇక ఆ తర్వాత సాయి తేజ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. సాయి తేజ్ మార్కండేయుడు (మార్క్) పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.. ఈ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది..

    మరి ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేసారు.. పవన్ కళ్యాణ్ స్టైలిష్ బైక్ మీద కాలు పెట్టి ముందు నిలబడగా ఆయన మోకాళ్లపై సాయి తేజ్ చేతులు పెట్టి నిలబడ్డాడు.. ఈ స్టైలిష్ ఫోటో ఇప్పుడు ఆడియెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.. ఇక ఈ సినిమాను జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...

    LokSabha Elections 2024 : తొలి విడత పోలింగ్.. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు

    LokSabha Elections 2024 : తొలి విడత జరుగుతున్న రాష్ట్రాల్లో కొన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...

    Jagan Dramas : జగన్ డ్రామాలకు ఎండ్ కార్డు వేస్తామంటున్న నేతలు!  

    Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన...

    Janasena B Forms : రేపు జనసేన అభ్యర్థులకు బీ ఫారాలు

    Janasena B Forms : జనసేన పార్టీ తమ అభ్యర్థులకు రేపు...

    Janasena : తెలంగాణలో పోటీపై జనసేన ఏం ఆలోచిస్తోంది?

    Janasena : తెలంగాణలో పవన్ కల్యాణ్ కు ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన...