Bro Teaser Update : పవన్ చాలా రోజుల తర్వాత చాలా ఎనర్జిటిక్ గా సినిమాల్లో కనిపిస్తున్నారు. వరుసగా హిట్లు పడుతున్నాయి కదా.. అందుకే ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నాడు. మొన్న వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో ఆయన ఎంత ఎనర్జిటిక్ గా కనిపించారో చూశాం. ఇప్పుడు బ్రో సినిమా అప్ డేట్లతో ఇరగదీస్తున్నాడు.
సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. సాయితేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక మామా అల్లుళ్లు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు బాగానే ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా మరో పోస్టర్ ను వదిలారు. ఇది టీజర్ పోస్టర్. ఈ పోస్టర్ లో మామా, అల్లుడు మాస్ లుక్ లో చంపేశారు. పవన్ లుంగీ కట్టులో, చేతిలో బీడీ, ఎర్రటి రుమాలు మెడలో ధరించి ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆయన్ను ఇలాంటి లుక్ లో చూసి చాలా కాలం అయిపోయింది.
బ్రో టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని ఇందులో అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. గతంలో తమ్ముడు సినిమా టైమ్ లో ఇలాంటి గెటప్ లో కనిపించాడు పవన్. చాలా రోజుల తర్వాత ఇలాంటి లుక్ లో దర్శనం ఇస్తున్నాడు పవర్ స్టార్.