Bro the Avatar జులై 28న రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే నెల రెండు నెలల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్.. కానీ పవర్ స్టార్ సినిమాకు ఇంత వరకు అంతగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.
ఏదో టీజర్, పాటలు తప్ప పెద్ద ప్రమోషన్ చేయకపోవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే కంగారులో ఉన్నారు. అయితే తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ తో ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఖాయం అని క్లారిటీ ఇచ్చేసారు.
మరో 9 రోజుల్లో బ్రో సినిమా రాబోతుంది అంటూ స్టైలిష్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో పవర్ స్టార్ గిటార్ పట్టుకుని స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్ లో ఉన్నాడు. ఇక పక్కనే సాయి తేజ్ కూడా ఉండడంతో ఈ పోస్టర్ వైరల్ అయ్యింది. అసలు ఏ మాత్రం ప్రమోషన్స్ లేకపోయిన బ్రో సినిమాతో పవర్ స్టార్ చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.
ఇక ఈ సినిమా టికెట్స్ ఆన్ లైన్ లో ఓపెన్ అవ్వగా 10 నిమిషాల్లోనే 2000 టిక్కెట్లు అమ్ముడు పోయాయి. దీంతో జీరో ప్రమోషన్స్ తో పవర్ స్టార్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు..
ReplyForward
|