Bro the Avathaar :
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో: ది అవతార్ ఈ నెల 28న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా వినోదయ సీతం యొక్క రీమేక్. తమిళంలో ఈ సినిమాను సముద్రఖని డైరెక్టర్ చేశాడు. ఇక్కడ కూడా ఆయనే డైరెక్టర్ చేస్తున్నారు.
మేకర్స్ చెప్పిన గడువు మేరకే టీజర్‌ను ఆవిష్కరించారు. టీజర్ లో పవన్ కళ్యాణ్ ను టైమ్ గాడ్ గా చూపించారు. అయితే ఇందులో మేయిన్ కాన్సెప్ట్ ఏంటన్నది మాత్రం టీజర్ లో రివీల్ చేయలేదు. కానీ మంచి ఎంటర్ టైన్ మెంట్ చిత్రంగా కొనసాగుతుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది. టీజర్‌లో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ మెగా నటులను ఒకే ఫ్రేమ్‌లో చూడడం నిజంగా ఫ్యాన్స్ కు పండుగనే చెప్పాలి. మెగా ఫ్యాన్స్ కు ముందు ముందు సూపర్ ఫన్ ఇవ్వబోతున్నారు. పవర్‌స్టార్ పాతకాలపు కామెడీ టైమింగ్ ను ఈ సినిమాలో చూపించినట్లు కనిపిస్తోది. ఇంకా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంది.
ఇక సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాలో తనదైన ముద్ర వేసుకున్నట్లు టీజర్లో అర్థం అవుతుంది. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ ఈ ఫాంటసీ కామెడీని నిర్మిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 28 జూలై, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.






