‘Bro’ Trailer :
జులై 28న రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కు మరింత హోప్స్ పెంచడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.. ఈ క్రమంలోనే ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
అసలు ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి మేకర్స్ మరిన్ని ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉండగా ఆలస్యం అయ్యింది. ఇప్పటికి కూడా మించి పోకుండా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా తెలిపి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. రిలీజ్ వాయిదా పడుతుంది అని అనుకున్న సినిమా పక్కా అదే డేట్ కు రిలీజ్ అవుతుంది అని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఇక ఫ్యాన్స్ కు సంతోషంగా మునిగిపోయారు.
ఎట్టకేలకు తాజాగా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. రేపు అంటే జులై 22న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అయితే టైం మాత్రం చెప్పలేదు.. ఈ పవర్ ఫుల్ మాస్ ట్రైలర్ కోసం గెట్ రెడీ అంటూ అధికారికంగా ప్రకటన రావడంతో రేపటి కోసం ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.. చూడాలి మరి ఈ ట్రైలర్ ఎలా ఆకట్టుకుంటుందో..
ఇక పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తుండడంతో ఈ సినిమాపై ముందు నుండి భారీ హైప్ ఉంది.. కాగా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు..