పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చిత్రాల్లో వచ్చే నెలలో విడుదలయ్యే చిత్రం బ్రో: ది అవతార్. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమా లేకపోవడంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. దీనికి తోడు వచ్చే నెలలోనే రిలీజ్ నేపథ్యంలో నిన్న (జూన్ 29) ఫైనల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. భారీ వ్యూవ్స్, కామెంట్లతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ నమోదు చేసుకోగలిగింది. ఇక లైకుల గురించి చెప్పక్కర్లేదు. ఇందులో పవన్ కళ్యాన్ వింటేజ్ లుక్ లో కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. సినిమాను కూడా ఇదే రేంజ్ లో ఎక్సపర్టేషన్ పెంచుకుంటున్నారు అభిమానులు.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘వినోదయ్యా చిత్తం’ మూవీకి ఇది రీమేక్. తమిళ సినిమాకు కూడా సముద్రఖని దర్శకత్వం వహించారు. అసలు విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తీసుకునేందుకు మొదట దగ్గుబాటి సురేశ్ బాబు ప్రయత్నం చేశాడు. వెంకటేశ్, రాణాను పెట్టి రీమేక్ చేయాలని ఆయన అనుకున్నాడు. సముద్రఖనికి కూడా చెప్పాడు. ఆయనకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే, తమిళ వెర్షన్ చూసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుందని సముద్రఖనికి సూచించారట. కానీ ఇప్పికే సురేశ్ బాబుకు మాట ఇచ్చానని సముద్ర ఖని చెప్పడంతో త్రివిక్రమే మధ్యలో ఉండి సురేశ్ బాబును ఒప్పటించారట. దీంతో వెంకటేశ్, రాణా చేయాల్సిన సినిమా పవన్ కళ్యాన్, సాయి ధరమ్ తేజ్ కు వచ్చింది.
తమిళంలో సూపర్ హిట్ చిత్రం కావడంతో తెలుగులోనూ అవే ఎక్సపర్టేషన్ పెట్టుకుంటున్నారు మేకర్స్. దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా తోడవుతుండడంతో ఇక బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఇండస్ట్రీలో ఇప్పటికే టాక్ ఉంది.
ReplyForward
|