Tdp Chendrababu nayuduతాజాగా రైతులకు కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో , మండల కేంద్రాలలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ఇష్యూ లోకి టీడీపీ అధినేత చంద్రబాబును లాగే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నది. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడని చర్చ పెడుతున్నది. దీంతో పాటు బషీర్ బాగ్ లో రైతులను కరెంటు కోసం కాల్చి చంపిన ఘటనను మరోసారి తెరపైకి తెచ్చింది. అయితే రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఇలా మాట్లాడించారని బీఆర్ ఎస్ చెబుతున్నది.
ఏపీలో పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా అది చంద్రబాబు చెప్పారని ప్రచారం అటువైపు వైసీపీ చేస్తున్నది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా చంద్రబాబు పేరుతో లింక్ చేయడం బీఆర్ ఎస్ కు అలవాటయింది. అయితే చంద్రబాబు వ్యవసాయం దండగ అన్న వీడియోలు బయటపెట్టాలని బీఆర్ఎస్ కు టిడిపి సవాల్ విసురుతున్నది.
ఇటీవల బీజేపీకి టీడీపీ మరోసారి దగ్గరవుతున్నది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మరోసారి వేలు పెడుతున్నారని బీఆర్ఎస్ అనుమానిస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ఆయనను బదనాం చేసే ప్లానుకు వ్యూహం రెడీ చేసింది. అవసరం లేకున్నా చంద్రబాబు పేరును పదేపదే తెలంగాణ రాజకీయాల్లో తెస్తూ బీఆర్ఎస్ ఆయనను ఒక బూచిలా చూపెడుతున్నది.
ReplyForward
|