
BRS First list : రానున్న ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరోక్షంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ర్ట ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగారు. పదేళ్ల తెలంగాణ పాలనలో రాష్ర్టం ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.
80 మందితో తొలి జాబితా ..
ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థులనే తేల్చుకోలేకపోతుండగా, బీఆర్ఎస్ మాత్రం క్యాండిడేట్లను ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. వచ్చే నెల 15న 80 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
హ్యాట్రిక్ కొట్టాల్సిందే..
తెలంగాణ లో వరుసగా రెండు సార్లు విజయం సాధించిన సీఎం కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇందుకు ఏడాది నుంచే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఈ మేరకు కేసీఆర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. పీకే టీం ద్వారా ఇప్పటికే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రహస్య సర్వేలు చేయించారని తెలిసింది. సర్వేల ఆధారంగా ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేశారని మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. వచ్చే నెల 15న 80 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. దీంతో ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది బీఆర్ఎస్ శ్రేణులకు స్పష్టంగా తెలుస్తుంది. అసమ్మతిని బుజ్జగించే పని కూడా సులువు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మిగతా 39 స్థానాల్లో క్యాండేట్లను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
పనితీరు బాగుంటేనే టిక్కెట్..
ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీంతో సర్వే చేయించారని తెలుస్తున్నది. ఈ సర్వే రిపోర్టులో 40 నుంచి 45 శాతం మార్కులు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది. బార్డర్ మార్కలు తెచ్చుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టికెట్ ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పక్కన పెట్టిన వారిలో కొందరు సీనియర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఆ నలుగరి సంగతి అంతేనా?..
స్టింగ్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఈసారి టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేడని తెలుస్తున్నది. తాండూరుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులకు ఈసారి టిక్కెట్లు వచ్చేది అనుమానమేనని తెలుస్తున్నది. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఉసిగొల్పింది. అయితే కేసీఆర్ ఈ కుట్రను ముందుగానే పసిగట్టారు. ట్రాప్ తర్వాత ఆ ఎమ్మెల్యేలను రోజుల తరబడి ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. వారిని బెస్ట్ ఎమ్మెల్యేలుగా పొగిడారు. ఇటీవలి కాలంలో ఆ నలుగురిలో ఒక్కరిని కూడా కలిసేందుకు కేసీఆర్ సుముఖంగా లేనట్లు తెలుస్తున్నది. వారు ఎంపీలతో కూడా స్నేహపూర్వకంగా లేరని కేసీఆర్
సర్వేల్లో తేలింది..
అలాగే రోహిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మధ్య విబేధాలు కూడా కొలిక్కి రావడం లేదు. రోహిత్‌రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తే గెలిపించబోమని మహేందర్‌రెడ్డి మద్దతుదారులు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. అలాగే హర్షవర్ధన్ రెడ్డి కి ప్రజాదరణ లేదని, గువ్వల బాలరాజు ఫ్యూచర్ కూడా అంతంత మాత్రమేనని తెలుస్తున్నది.