
BRS focuse on home : ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత అందరికీ తెలిసిందే. ఉధ్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. అప్పటి నుంచి కేసీఆర్ ‘దేశ రాజకీయాల్లోకి వెళ్తానని మోడీ నుంచి దేశాన్ని కాపాడుతానని’ ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు. థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానంటూ వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కలిసి వచ్చాడు. దీనిలో భాగంగా మహారాష్ట్రలో సభలు, సమావేశాలు నిర్వహించాడు. అక్కడ బీఆర్ఎస్ లో చేరికలు కూడా చేపట్టారు. ఇటు స్టాలిన్, అటు కుమారస్వామి, మాయావతి, కేజ్రీవాల్ ను అందరినీ ఒక్కటి చేసి థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికాదు. కానీ ఎవరూ కేసీఆర్ తో కలిసి వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి నుంచే కేసీఆర్ మాటలను పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ లిక్కర్ స్కాంతో దగ్గరయ్యారు. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ మొన్న ప్రధానిని కలిసి థర్డ్ ఫ్రంట్ అనేది సాధ్యం కాదని, ఒక వేళ అది సాధ్యమైనా దానిలో నేను ఉండనని ప్రకటించారు. ఇక మాయావతి కేసీఆర్ ను మొదటి నుంచే పట్టించుకోలేదు. ఇలా ప్రతీ రాష్ట్రంలో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. దీనికి తోడు కర్ణాటక ఎన్నికలు ఇప్పుడు మరింత గుబులు రేపుతున్నాయి. దేశం మాట అటుంచితే సొంత రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం ఇప్పడు సమస్యగా మారింది. అందుకే దేశ రాజకీయాల్లో కాకుండా రాష్ట్ర రాజకీయాలపై అందునా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిందని సంబురాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఎక్కడ దెబ్బేస్తుందోనన్న కలవర పాటు లేకపోలేదు. పక్క రాష్ట్రంలో అక్కడి స్థానిక పార్టీ గెలిస్తే ఓడిపోయిన పార్టీని గేలి చేస్తూ సంబురాలు చేసుకోవడం కామనే. కానీ అక్కడ జాతీయ పార్టీ గెలిస్తే.. ఏం చేయాలి పైకి సంబురాలు చేసుకున్నా వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఇదే ఊపు కొనసాగిస్తే ఎలా..? అంటూ బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గెలిచినందుకు సంబురాలు చేసుకుంటున్నాం సరే.. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కేడర్ ఉంది. అది పటిష్టంగా వర్క్ చేసి పదవిలోకి వస్తే ఇదే గుబులు బీఆర్ఎస్ కు పట్టుకుంది. అందుకే దేశ రాజకీయాలను పక్కన పెట్టిన కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.