అయితే బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి ఇదే ఇంటర్వ్యూలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. దళితబంధును సంతృప్తికర స్థాయిలో అమలు చేయలేకపోయామని, అయితే చేయాలని మాత్రం ప్రభుత్వానికి ఉందంటూ మాట్లాడారు. అందరికీ అందించాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంటుందని మాట్లాడారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మరికొన్ని వసతులు కల్పించాల్సిన అవసరముందంటూ మాట్లాడారు. గురుకులాల విషయంలో రిటెర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సేవలను ఆయన కొనియాడారు., ఆయన ఎంతో చేశారు. కేసీఆర్ పాలసీని ప్రవీణ్ కుమార్ అమలు చేశారంటూ కొనియాడారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విషయంలో ముఖ్యమంత్రి మనుమడు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఏపీలో పరిస్థితులపై కడియం కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది. మరోసారి జాలేస్తుంది. ఆ రాష్ర్టాన్ని పూర్తిగా కులం వైపు తీసుకెళ్లారు. దేశంలోనే అత్యంత అవినీతి పరుడు జగన్. ఆయన కూడా అవినీతి గురించి మాట్లాడుతాడు. ఇదే ఆశ్చర్యమేస్తుంది అంటూ జగన్ పై వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఆయనే అందినకాడికి దోచుకొని పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం అంటాడు. ఇదేంటో అర్థం కావడం లేదు. రిచెస్ట్ సీఎం దేశంలో ఆయనే అందరికీ తెలుసు కదా.. ఇంకా జగన్ గురించి అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేం. అంటూ పక్క రాష్ర్ట సీఎం పై విరుచుకుపడ్డాడు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల నుంచి ఎదురుదాడి కూడా ఉండే అవకాశం ఉంది.
ReplyForward
|