
BRS Silver Jubilee Celebration : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న భారీ రజతోత్సవ సభ – ‘చలో వరంగల్’ పోస్టర్‌ను లండన్‌లో ఆవిష్కరించారు. చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, లండన్‌లో కూడా త్వరలో రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భారాస యూకే ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, అడ్వైసరీ వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, సభ్యులు పవన్ కళ్యాణ్, అజయ్ రావు గండ్ర తదితరులు పాల్గొన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత టవర్ బ్రిడ్జి వద్ద ‘చలో వరంగల్’ పోస్టర్‌ను ఆవిష్కరించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.