Bubble Blowing Building : నిర్మాణ రంగం ఏ రోజుకు ఆ రోజు డెవలప్ అవుతూనే ఉంది. భారీ నిర్మాణాలను అత్యంత సులువుగా నిర్మించేందుకు ఇంజినీర్లు నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. ప్రతీ సారి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ నిర్మాణ రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్ సిటీలోని మిడ్ టౌన్ మాన్ హట్టన్ పరిసరాల్లో అతి పొడవైన నిర్మాణం ‘స్టెయిన్ వే టవర్ (111 వెస్ట్ 57వ వీధి)’. జేడీఎస్ డెవలప్ గ్రూప్, ప్రాపర్టీ మార్కెట్స్ గ్రూప్ కలిసి నిర్మించారు. ఇది 1,428 అడుగుల పొడవుగా ఉంటుంది. దీనిని 111 వెస్ట్ 57వ వీధి అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యం. ఇలాంటి ఎన్నో ఆసక్తి కర నిర్మాణాలు చేపట్టిన ఇంజినీర్లు వినూత్నంగా నిర్మాణం చేసేందుకు ప్రయోగాలు చేశారు. ఇది సక్సెస్ కావడంతో సులువుగా, తక్కువ ఖర్చుతో నిర్మాణాలు అందుబాటులోకి రానున్నాయి.
బబుల్ బ్లౌవింగ్ టెక్నాలజీ..
బబుల్ బ్లౌవింగ్ టెక్నాలజీని ఇంజినీర్లు ఇప్పుడు పరిచయం చేశారు. అమెరికాకు చెందిన ‘బినిషెల్’ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్మాణం చాలా వింతగా ఉంటుంది. మొదట ఒక ప్రాంతాన్ని ఎంచుకొని నిర్మాణంకు సంబంధించి ప్లాన్ గీసుకుంటారు. ప్లాన్ ప్రకారం ప్రత్యేకమైన ప్లాస్టిక్ లాంటి కవర్ ఏర్పాటు చేశారు. ఈ కవర్ లోకి ఎయిర్ ను పంప్ చేస్తారు. పంపింగ్ ద్వారా కవర్ ఉబ్బుతుంది. దానిపై ఐరన్ రాడ్స్ ఉంచి సిమెంట్ మిశ్రమాన్ని పోస్తారు. ఇది గట్టి పడిన తర్వాత కింద ఉన్న ప్లాస్టక్ కవర్ ను తొలగిస్తారు. దీంతో నిర్మాణం పూర్తవుతుంది.
ఈ నిర్మాణంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో పెద్ద నిర్మాణం చేపట్టవచ్చు. విపత్తులను తట్టుకునేలా ఉంటుంది. గాలి, వెలుతురు ఎక్కువగా ఉంటుంది. భారీగా కాంక్రీట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కువగా టూరిస్ట్ ప్రదేశాలలో నిర్మించుకుంటే డబ్బు సమయం ఆదా చేసుకోవచ్చు. అడవులు, మౌంటెన్ ప్రాంతాల్లో నిర్మించుకుంటే సౌకర్యంగా ఉంటుంది. నిర్మాణాలను చూసిన వారు వారెవ్వా అంటున్నారు. తొందరగా అందుబాటులోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.