
Buttermilk : వేసవి కాలంలో వేడిని తట్టుకునేందుకు అందరు మజ్జిగ తాగుతుంటారు. పెరుగు కంటే మజ్జిగే నయం. పెరుగుతో వేడి చేస్తుంది. కానీ మజ్జిగ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో నీటి కొరత లేకుండా చేస్తుంది. పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇందులో పొటాషియం, విటమిన్ బి12 కాల్షియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
భోజనానికి ముందు మజ్జిగ తాగుతుంటారు. దీని వల్ల మరింత ఆకలి అవుతుందని చెబుతుంటారు. మజ్జిగను అల్పాహారంగా తీసుకుంటే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. రోజులో మజ్జిగను ఎప్పుడైనా తాగొచ్చు. ఆహారానికి ముందైనా తాగొచ్చు. తిన్న తరువాత కూడా తాగితే మంచిదే. మజ్జిగ తాగడం వల్ల పొట్టకు మేలు కలుగుతుంది.
మజ్జిగ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ ఉండటం వలల జీవక్రియ బాగుంటుంది. ఆహారం తీసుకున్న తరువాత ఓ గ్లాసు మజ్జిగ తాగడం మంచిది. మజ్జిగ తాగడం వల్ల ఒంట్లో ఎసిడిటి నుంచి ఉపశమనం పొందవచ్చు. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఇది దోహదపడుతుంది. సాయంత్రం లేదా రాత్రి మజ్జిగ తాగడం మంచిది కాదు.
ప్రతి రోజు ఒకటి లేదా రెండు గ్లాసుల కంటే ఎక్కువ మజ్జిగ తాగితే హానికరమే. మజ్జిగ ఎక్కువ తాగితే గ్యాస్, కడుపు నొప్పి లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనం. అల్పాహారంలో మజ్జిగ తాగితే గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.






