What if the wife works కొత్తగా పెళ్లి చేసుకునే వారికి ఎన్నో ఆశలు. మరెన్నో ఊసులు. కాపురం గురించి తలుచుకుని ఎంతో యాంగ్జయిటీ ఫీలవుతుంటారు. జీవితంలో ఎలా మసలుకోవాలి. భార్యతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి ఆలోచిస్తుంటారు. కాబోయే జీవిత భాగస్వామి గుణగణాలు ఎలా ఉంటాయో తెలియదు. అణకువగా ఉంటే ఫర్వాలేదు. మనల్ని వంగబెట్టేలా ఉంటేనే కష్టం.
కాబోయే జీవిత భాగస్వామి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉందంటే పెళ్లి తరువాత ఉద్యోగం కొనసాగించాలా? వద్దా? అనేది తేల్చుకోవడం లేదు. ఉద్యోగం పురుష లక్షణం అనే వారు. కానీ ఇప్పటి ఆడవారు సైతం ఉద్యోగాలు చేస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది భర్తలు కూడా వారిని సపోర్టు చేస్తున్నారు.
ఇప్పుడు భార్య ఉద్యోగం చేస్తే ఏమిటి? ఇంటి దగ్గర వంట చేసే వారెవరు అనే విషయంలోనే ఇద్దరి మధ్య వాదనలు వస్తుంటాయి. ఇద్దరు సమన్వయంతో వ్యవహరిస్తే ఆ సమస్య ఉండదు. కానీ చాలా మంది షరతులు పెడుతుంటారు. దీంతోనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా దంపతుల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు అవగాహనతో ఉంటే సరి.
జీవిత భాగస్వామికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి చొరవ చూపాలి. అప్పుడే ఇద్దరు ఉద్యోగం చేసుకుంటే ఎలాంటి బాధలు ఉండవు. కాపురం సజావుగా సాగాలంటే ఇద్దరి మధ్య అవగాహన కుదిరితేనే సాధ్యమవుతుంది. ఇలా భార్యాభర్తలు ఇద్దరిలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా నడుచుకుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది.