ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన తర్వాత ఏం చేస్తుంటారు.. ఎక్కడ పడేస్తారో తెలుసా.. అసలు వీటిని రీ సైకిల్ చెయొచ్చా.. అనేది చాలా మందికి తెలువదు.. మరి ఏం చేస్తారో తెలుసుకుందాం..
ప్రపంచం మొత్తం మీద ఏటాం 150 కోట్ల టైర్లను వాడుతుంటారు. ప్రతి మాములు టైరు 25 వేల నుంచి 40 వేల కిలో మీటర్ల వరకు వాడుతుంటారు. ఆ తర్వాత వాటిని పడేస్తుంటారు. ఇలా రోడ్ల పక్కనే పడేస్తుంటారు. గత 20 ఏండ్లుగా వాడి పడేసిన ప్రపంచవ్యాప్తంగా టైర్లను కువైట్ లో ఉంచుతున్నారు. అయితే టైర్లను మాత్రం రీసైకిల్ చేయడం అసాధ్యం. ఎందుకంటే టైర్లు రబ్బర్, సల్ఫర్ తో తయారవుతాయి. అందుకే వీటిని కరగబెట్టడం కుదరదు. రీసైకిల్ చేయాలని కాలిస్తే ప్రమాదకర వాయువులు వెలువడుతాయి. ఇది ప్రాణంతకం. పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది, అందుకే చాలా దేశాల్లో టైర్ల రీసైకిల్ కు అనుమతి లేదు. యూరప్ దేశాల్లో టైర్లను చెత్త కుప్పల్లో పడేయడం కూడా నేరమే. అందుకే చాలా వరకు దేశాలు వాడి పడేసిన టైర్లను కువైట్ కు పంపిస్తాయి. అరేబియాలో ఎడారిలో ని ఓ యార్డులో దీనిని పడేస్తున్నారు. ఇవి అంతా ఇప్పుడు గుట్టలుగా మారాయి. ఇప్పటివరకు సుమారు 7 కోట్ల టైర్లు ఇక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడ మంటలు అంటుకోవడం.. సమీప పట్టణాల ప్రజలు అస్వస్థతకు గురికావడంతో కువైట్ దీనిపై పునరాలోచించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో తర్వాత వీటిని ఆయా దేశాలకు పంపించడం మొదలుపెట్టింది. అక్కడ వాటిని ముక్కలుముక్కలుగా చేయడం ప్రారంభించింది. తర్వాత ఈ టైర్లను పొడి చేసి, నిర్మాణ రంగంలో వాడడం మొదలుపెడుతున్నారు. దీంతో ఇప్పుడు కువైట్ లో ఉన్న టైర్ల యార్డు ఇప్పుడు ఖాళీ అయ్యింది.