
ప్రస్తుతం వడగళ్ల సీజన్ కావడంతో ఇటీవల పడిన వానకు రైతులు నష్టపోయారు. వడగళ్లు (hailstones) కడగళ్లను మిగిల్చాయి. చేతికందిన పంటను చేజేతులా నాశనం చేయడంతో ఏం చేయాలో తోచడం లేదు. సాధారణంగా వేసవి కాలంలో వడగళ్లు పడటం మామూలే. కానీ ఈసారి పంటలను నాశనం చేసింది. పెట్టుబడి కూడా రాకుండా చేసింది. ఏం చేయాలో తోచక చేతులు పిసుక్కుంటున్నారు. వరణుడు చేసిన పనికి ఏం పాలుపోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వరుణుడు ఎందుకు ఇంత పగబట్టాడు. చేతికొచ్చిన పంటను పాడు చేసి డబ్బులు రాకుండా చేశాడు. మళ్లీ పంట వేయాలంటే కూడా భయపడుతున్నారు. ఈ కాలంలోనే వడగళ్లు ఎందుకు వస్తాయి? వడగళ్లను తింటారా? అనే సందేహాలు కూడా చాలా మందికి వస్తుంటాయి. వడగళ్లు వేసవిలోనే వస్తాయి. ఈ కాలంలోనే వాటి ప్రభావం చూపుతాయి. పంటలను దెబ్బతీస్తాయి.
కొందరు వాటిని తినొచ్చు అంటారు. మరికొందరేమో వాటిని తినొద్దు అని వారిస్తారు. తింటే ఏమవుతుంది? అందులో ఏముంటుంది? అనే సందేహాలు రావడం సహజమే. సల్ఫేట్స్, నైట్రేట్స్, అమోనియా, అయాన్లు వంటి రసాయనాలతో ఏర్పడతాయి. అందుకే వీటిని తినడం అంత సురక్షితం కాదు. అందుకే వీటిని తినొద్దని వారిస్తుంటారు.
వడగళ్లను తినొద్దు. వాటిని చేతిలో పట్టుకుంటే ఫర్వాలేదు. కానీ తినాలనే ఆలోచన సరైంది కాదు. తినడం మంచిది కాదు. దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వడగళ్ల వల్ల రైతుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. చేతికందిన పంట వర్షార్పణం అయింది. ఏం చేయాలో తోచడం లేదు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరినా ఫలితం లేదు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.






