
అక్కినేని అఖిల్, స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వస్తున్న ఏజెంట్ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాపై అఖిల్, సురేందర్ రెడ్డితో పాటు నాగార్జున చాలా ఆశలు పెట్టుకున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న అక్కినేని కుటుంబానికి ఏజెంట్ సినిమా విడుదల కొంత ఊరటనిచ్చే అంశం.
హిట్ పడాల్సిందే..
అక్కినేని ప్రిన్స్ అఖిల్ కు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. హీరోగా సక్సెస్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏజెంట్ సినిమా కోసం తన మేకోవర్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. మొత్తం బాడీ ట్రాన్స్ఫార్మ్ చేశాడు. సిక్స్ ప్యాక్ తో బాడీని హెవీగా పెంచాడు. తన కష్టం అంతా ఈ సినిమా లో స్పష్టంగా కనిపిస్తున్నది. అలాగే సురేందర్ రెడ్డి గత చిత్రం మెగాస్టార్ చిరంజీవితో తీసి సైరా నర్సింహారెడ్డి అంచనాలను అందుకోలేకపోయింది.
స్వాతంత్ర్య సమరయోధుడి బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ తో పాటు సుదీప్, సేతుపతి, నయనతార, తమన్నా లాంటి భారీ కాస్టింగ్, పాటు గ్రాఫిక్స్ తో హై ఎక్సెపెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ సినిమాలను సురేందర్ రెడ్డి అత్యద్భుతంగా తీస్తాడనే ముద్ర ఈ సినిమా చెరిపేసింది. దీంతో ఇప్పుడు అఖిల్ కు హిట్ పడడం ఎంత అవసరమో, డైరెక్టర్ కు అంతకన్నా ఉంది. ఒకవేళ ఈ సినిమా పోయినా అఖిల్ తన సొంత బ్యానర్ లో మరో సినిమా చేసుకుంటాడు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి కి మాత్రం కచ్చితంగా హిట్ పడాల్సిందే. తన భవిష్యత్ ను నిర్ధారించేది ఈ సినిమానే. ఈ సినిమా సక్సెస్ తోనే తన తదుపరి సినిమాలు ఆధారపడి ఉంటాయి.
ఏజెంట్ కి ప్లస్ ఇవ్వే..
దాదాపు రెండేళ్ల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. స్పై బ్యాక్ డ్రాప్ తో ఇప్పటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ జానర్ లో ఈమధ్య కాలంలో సినిమా రాలేదు. ఇంది కొంత వరకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతుంది. అలాగే ప్రతి ఫ్రేమ్ లో సినిమా రిచ్ నెస్ కనిపిస్తున్నది. అఖిల్ లుక్ సినిమాకు హైలెట్ గా చెప్పవచ్చు. ఈ సినిమాకు మమ్ముట్టి కూడా తోడవడంతో మరింత్ హైప్ క్రియేట్ అయ్యింది.






