ATM :
ఈ రోజుల్లో అందరు ఫోన్ పే, గూగుల్ పేలు వాడుతున్నారు. లావాదేవీలన్ని ఆన్ లైన్ లోనే కొనసాగుతున్నాయి. గతంలో డబ్బులు కావాలంటే ఏటీఎంకు వెళ్లేవారు. ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు ప్రస్తుతం అంతా ఆన్ లైన్ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏటీఎంలలో కార్డు లేకున్నా డబ్బులు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇప్పుడు ఏటీఎం మరిచిపోయినా ఫర్వాలేదు. డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీంతో కార్డ్ లెస్ లావాదేవీలు పెరగనున్నాయి. కార్డు మరిచిపోయిన సందర్భాల్లో సైతం డబ్బులు తీసుకునే అవకాశం ఉండటంతో కంగారు పడాల్సిన పనిలేదు. ఎస్బీఐ ఈ మేరకు వినియోగదారులకు శుభవార్త చెబుతోంది. యోనో యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఏటీఎం కార్డు లేకపోయినా యాప్ నుంచి క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.
ఎస్బీఐ ఖాతాదారులే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యాప్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు తీసుకునే అవకాశం ఇస్తోంది. యోనో యాప్ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడకు వెళ్లినా మనం స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి వీలుంటుంది.
ఎస్బీఐ తీసుకొచ్చిన కార్డ్ లెస్ మనీ విత్ డ్రాలతో మనీ చలామణి సులభం అయిపోతోంది. ఇలా కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడంతో ఇక మీదట డబ్బు కోసం సులభమైన మార్గాలు ఉంటున్నాయి. దీంతో ప్లాట్ ఫాం ఫీజు కింద సర్వీసు చార్జీ ఎంత వసూలు చేస్తుందో అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మనీ ట్రాన్స్ ఫర్ కు మరిన్ని లాభాలు రానున్నాయి.