
Rs 2000 note : రూ. 2 వేలనోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా ప్రజల్లో నెలకొనే సందేహాలను నివృత్తి చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై ప్రజలకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు చెప్పడంతో పాటు తమ వద్ద ఉన్న రూ. 2వేల నోట్లను సెప్టెంబర్ 30 లోగా మార్చకోవాలని కోరింది
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 2వేల నోటును ప్రశేశ పెట్టినట్లు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిమాండ్ కు సరిపడా కరెన్సీని అందుబాటులో కి తెచ్చేందుకే రూ. 2 వేల నోటును ప్రవేశ పెట్టినట్లు పేర్కొ్ంది. 2018-19 నుంచే పూర్తిగా ముద్రణ నిలిపివేసినట్లు తెలిపింది. ఇప్పుడున్నవన్నీ 2017 కు ముందు ముద్రించనవేనని, వీటి జీవితకాలం 4 నుంచి 5 ఏండ్లు మాత్రమేనని పేర్కొంది. ప్రస్తుతం వీటిని 30 సెప్టెంబర్ 2023లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మార్చుకోవాలి. ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ వీటిని మార్చుకోవచ్చు. అయితే ఒక దఫాలో కేవలం రూ. 20వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే అకౌంట్ ఉన్న బ్యాంకులోనే కాకుండే ఎక్కడైనా దీనిని మార్చుకునే అవకాశం కల్పించారు.
బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద రోజుకు కేవలం రూ. 4 వేలు మాత్రమే మార్చుకునే వీలుంటుంది. అయితే 23 మార్చి 2023 నుంచి రూ. 2వేల నోట్లు మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే డిపాజిట్ల పై ఎలాంటి అంక్షలు లేవు. తమ అకౌంట్లలో ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ నోట్ల మార్పిడి పూర్తిగా ఉచితం. ఇందుకోసం ఏమాత్రం చెల్లించాల్సిన పనిలేదు. నాలుగు నెలల సమయంలో రూ. 2వేల నోట్లను మార్చుకోవాలని, ఆ తర్వాత అవి చెల్లుబాటు కావాలని పేర్కొంది.
సేవల్లో లోపం ఉంటే వినియోగదారుడు ముందుగా బ్యాంకు అధికారులను సంప్రదించాలి. సరైన సమాధానం బ్యాంకుల నుంచి రాకపోతే రిజర్వ్ బ్యాంక్ నియమించిన అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయవచ్చు.