Home EXCLUSIVE Cannes Film Festival 2024 : భారతీయ లఘు చిత్రానికి కేన్స్ లా సినీఫ్ ఫస్ట్...

Cannes Film Festival 2024 : భారతీయ లఘు చిత్రానికి కేన్స్ లా సినీఫ్ ఫస్ట్ ఫ్రైజ్

18
Cannes Film Festival 2024
Cannes Film Festival 2024

Cannes Film Festival 2024 : ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) విద్యార్థి హిదానంద ఎస్ నాయక్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-77లో ప్రతిష్ఠాత్మక లా సినీఫ్ ఫస్ట్ ఫ్రైజ్ గెలుచుకున్నాడు. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ ‘Sunflowers Were The First Ones To Know’ అత్యున్నత గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ పురస్కారం ఎఫ్ టీఐఐ విద్యార్థి ప్రతిభను చూపుతుంది. అంతర్జాతీయ వేదికపై నాయక్ కు గణనీయమైన విజయాన్ని తెచ్చిపెట్టింది.

ఈ షార్ట్ ఫిల్మ్ కథేంటి?
కేవలం 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో ఒక ముసలావిడ కోడిని దొంగిలించి, తన గ్రామం ఎప్పటికీ చీకటిగా ఉండేలా చేస్తుంది. ఒక కన్నడ జానపద కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు కేన్స్ అవార్డు అంటే ఏమిటి?

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటి బహుమతి విజేతకు 15,000 యూరోలు (రూ. 13,50,044) గ్రాంట్ లభిస్తుంది. దీనితో పాటు తృతీయ బహుమతి కూడా మన భారతీయుడే గెలుచుకున్నాడు. మీరట్ కు చెందిన మాన్సి మహేశ్వరి దర్శకత్వం వహించిన బన్నీహుడ్, నిఫ్ట్ ఢిల్లీ పూర్వ విద్యార్థిని మూడో బహుమతి దక్కించుకుంది.

యూకేలోని నేషనల్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆమె ఈ సినిమా చేసింది. ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి 7,500 యూరోలు (రూ. 6,74,978) గ్రాంట్. రెండో బహుమతి కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్యా సెగలోవిచ్ దర్శకత్వం వహించిన అవుట్ ఆఫ్ ది విడో త్రూ ది వాల్ కు దక్కింది.
గ్రీస్ లోని థెస్సలోనికిలోని అరిస్టాటిల్ విశ్వవిద్యాలయానికి చెందిన నికోస్ కొలియోకోస్ రూపొందించిన ది కాయోస్ షీ లెఫ్ట్ బిహైండ్ దీన్ని దక్కించుకుంది. అస్యా 11,250 యూరోలు (రూ. 10,12,467) దక్కించుకున్నాడు.