
Bellamkonda Srinivas : హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పరిధిలో రెండ్రోజుల క్రితం కారులో రాంగ్‌రూట్‌లో వెళ్తూ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. కానిస్టేబుల్ అడ్డుకోవడంతో అతనితో వాగ్వాదానికి దిగి, అతనిపైకి కారు పోనివ్వడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్‌ను విచారించే అవకాశం ఉంది