Caste census in Telangana : కులగణనపై బీఆర్ఎస్ నేతలు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభా కర్ అన్నారు. పదేళ్లలో కుల గణనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కాళ్లల్లో కట్టెపెట్టేలా మాజీ మంత్రి గంగుల వ్యాఖ్యలు ఉన్నాయని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయట పెట్టలేదో బీఆర్ఎస్ చెప్పాలని అన్నారు. కుల గణనపై ఎవరికీ అనుమానం లేదు.. అందరి ఆలోచనలు తీసుకుంటాం. కుల గణన కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్ అని పొన్నం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం దేశానికి ఆదర్శం కానుందని, చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకోవడం నా అదృష్టం అని పొన్నం పేర్కొన్నారు.