
sexual desire : ఈ రోజుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. జంట్లో విభేదాలు పెరుగుతున్నాయి. శృంగార వాంఛలు సన్నగిల్లడంతో దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తోంది. జీవిత భాగస్వామి భర్తతో ఉండలేకపోతుంది. దీంతో విడాకుల వరకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య తలెత్తడానికి పలు కారణాలు వస్తున్నాయి. శృంగారంలో ఇబ్బందులు రావడానికి కారణమయ్యే విషయాలేంటో చూద్దాం.
మానసిక ఒత్తిడి శృంగార వాంఛల్ని తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. లైంగిక కోరికలు లేకుండా చేస్తుంది. ఒత్తిడి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలా శృంగార సమస్యలు తలెత్తడం వల్ల సంసారాలు విడిపోయేందుకు కారణాలుగా నిలుస్తున్నాయి.
పురుషులు లైంగిక కార్యకలాపాలపై ఆసక్తి చూపించడం లేదు. ఇది వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతోంది. దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడే వారికి కూడా శృంగార వాంఛలు తగ్గుతాయి. ఆహార అలవాట్లు కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. మద్యపానం, ధూమపానం చేసే వారిలో లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
మంచి నిద్ర కూడా మన శృంగార వాంఛల్ని పెంచుతుంది. సరైన నిద్ర లేకపోతే లైంగిక ఆసక్తి లేకుండా పోతుంది. రోజు వ్యాయామం చేయాలి. ధ్యానం, యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. సమతుల ఆహారం తీసుకోవాలి. అల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.