25.3 C
India
Tuesday, July 16, 2024
More

  Venuswamy : తాను చెప్పిందే జరిగిందన్న సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి..

  Date:

  Venuswamy
  Venuswamy

  AstVenuswamy : సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అవసరం లేదు. సినిమా వారి ఇంట్లో పూజలు, శుభకార్యాలతో ఫేమస్ అయిన వేణుస్వామి రాజకీయ నాయకుల గురించి మాట్లాడి మరింత ఫేమస్ అయ్యాడు. తన ప్రిడిక్షన్ చాలా వరకు నిజం అవుతుందని అనుకుంటాడు ఆయన. కానీ కొన్ని సార్లు అది తప్పి చిక్కుల్లో కూడా పడతాడు. ఈ సారి కూడా అలానే జరిగింది. ఈ సారి ఆయన ప్రవర్తన ఎలా ఉందంటే చింత చచ్చినా పులుపు చావలేదు చందంగా ఉంది. తన ప్రిడిక్షన్ తప్పని రుజువైనా.. ఏపీ విషయంలో కొంచెం ఇలాగే కావచ్చు గానీ.. కేంద్రం విషయంలో తాను చెప్పిందే జరిగిందన్నారు.

  వేణు స్వామితో గతంలో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై ఆయన సంచలన విషయాలను ప్రిడిక్ట్ చేశాడు. ఓ యాంకర్ ఏపీలో ఎవరు తర్వాతి సీఎం అని వేణు స్వామిని ప్రశ్నించింది. దీనికి ఆయన తడబడకుండా ఠక్కున జగన్ అని చెప్పాడు. కన్ఫ్యూజన్ అయిన యాంకర్ మరోసారి చెప్పాలని కోరగా.. వేణు స్వామి ఏ మాత్రం తడపడకుండా జగన్మోహన్ రెడ్డి 2024, 2029లో రెండు దఫాలుగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. పైగా 2024 గెలుపు తర్వాత రూలర్ గా మారుతాడని కూడా చెప్పి టీడీపీని కన్ఫ్యూజన్ లోకి నెట్టాడు. ఈ వీడియో ఎక్స్ లో జనవరి 22, 2024న పోస్ట్ అయ్యింది.

  అయితే, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో ఈ వీడియోను వైసీపీ నాయకులు విపరీతంగా షేర్ చేయడం మొదలు పెట్టారు. ఈ వీడియో ఒక రకంగా ప్రచారానికి దోహదం చేసింది. టీడీపీ మాత్రం పోలింగ్ సరళి, ప్రచారంలో పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఆదరణ, పొత్తుతో కలిగిన ప్రయోజనాల (ఓటు చీలకుండా)ను బట్టి అంచనా వేస్తే రిజల్ట్ భిన్నంగా కనిపిస్తుందని చెప్తోంది. ‘ఎంత పెద్ద జ్యోతిష్యుడు అయినా చెప్పిన అన్ని విషయాలు జరగవని కొన్ని మిస్ కావచ్చని, అందులో ఇది కూడా ఒకటి కాబోతుందని’ టీడీపీ నాయకులు వీడియోకు కామెంట్లు కూడా పెట్టారు.

  అయితే జూన్ 4న వెలువడిన ఫలితాలలో టీడీపీ భారీ మెజారిటీతో గెలిచింది. వేణుస్వామి గెలుస్తుందని చెప్పిన వైసీపీ కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా దక్కించుకోలేదు. అయితే దీనిపై మరోసారి వేణు స్వామి స్పందించారు.

  తాను జాతకాల ప్రకారం చెప్పానని, ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్పింది తప్పవచ్చు గానీ, కేంద్రం విషయంలో తప్పలేదని అన్నారు. నరేంద్ర మోడీకి గతం కంటే కొంత చరిష్మా తగ్గిందని సీట్లు కూడా కొన్ని తగ్గాయని చెప్పుకచ్చారు.

  Share post:

  More like this
  Related

  Pawan : పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్.. లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!

  Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం...

  CM Relief Fund : ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు

  CM Relief Fund : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

  AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

  AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

  Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

  Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Venuswamy : ఇక జాతకాలు చెప్పనన్న వేణుస్వామి.. ఆయన జోస్యం అట్టర్ ఫ్లాప్..

  Venuswamy : అంతన్నాడు ఇంతన్నాడే మా ఏణుస్వామి.. చివరకు ముంతమామిడి పండు అన్నాడే...

  IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

  IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

  KlinKaara Konidela : క్లీంకార జాతకం గురించి ఆ వెదవలకేం తెలుసు

  KlinKaara Konidela : క్లీంకార అనగానే కాస్త మోడల్ గా ఉన్న...