21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Karimnagar to Hasanparti రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

    Date:

    Karimnagar to Hasanparti
    Karimnagar to Hasanparti

    Karimnagar to Hasanparti Railway line : కరీంనగర్ కు రైలు సదుపాయం తక్కువే. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూడగా నిజామాబాద్ రైలు మార్గం కల నెరవేరింది. కానీ భాగ్యనగరానికి సమీపంలోనే ఉన్నా జిల్లా ఎదగలేకపోవడానికి కారణం రైల్వే లైన్ లేకపోవడమే. పాలకుల నిర్లక్ష్యమో అధికారుల తప్పిదమో కానీ జిల్లా ప్రజలకు రైలు కల మోజు తీరడం లేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా కరీంనగర్ – హసన్ పర్తి మార్గం కల సాకారం కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇప్పటికే కొత్తపల్లి-మనోహరాబాద్ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ లైన్ పనులు పూర్తయితే హైదరాబాద్ కు వెళ్లడం సులభం కానుంది. దీంతో ఇప్పుడు హసన్ పర్తి మార్గం కూడా పూర్తయితే జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరే అవకాశం కలగనుంది. ఈ మేరకు ఎంపీ బండి సంజయ్ ఈ లైన్ కోసం కేంద్ర రైల్వే మంత్రిని ఒప్పించి దీని కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు.

    ఎన్నో ఏళ్లుగా హసన్ పర్తి రైలు మార్గం కోసం వినతులు వస్తున్నాయి. దీంతో ఎట్టకేలకు ఎంపీ చొరవ తీసుకుని లైన్ కు మోక్షం కలిగించనున్నారు. భూమి రీ సర్వే కోసం రూ. 1.54 కోట్లను మంజూరు చేశారు. 62 కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వే లైన్ పనులకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో ప్రజల ఆకాంక్ష తీరినట్లు అవుతోంది. ఇదంతా బండి సంజయ్ ప్రోద్బలంతోనే జరుగుతున్నట్లు నేతలు చెబుతున్నారు.

    కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేయనున్నారు. పనులు శరవేగంగా నిర్వహించి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. దీని వల్ల హసన్ పర్తి కల సాకారం కావడానికి అందరు సహకరించాని కోరుతున్నారు. ఎట్టకేలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ దక్కడంతో పనులు జరిపి ప్రజల ఆకాంక్ష తీర్చాలని చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Red sandalwood : 100 ఏళ్ల నాటి ఎర్రచందనం చెట్టు కోసం రూ.కోటి డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశం

    Red sandalwood : ఖర్షీ గ్రామానికి చెందిన రైతు కేశవ్ శిందే తన...