
Good News for AP :
ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావంతో చాలా రాష్ర్టాల్లో వానలు పడుతున్నాయి. మహారాష్ర్ట, గుజరాత్, అస్సాం,ఛత్తస్ గఢ్, తదితర రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నాయి. ఇక మహారాష్ర్టలో ముంబై సహా థానే పట్టణాలతో సహా ఏడెనిమిది జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్నది.
ఇక భారీ వర్షాల నేపథ్యంలో అన్ని రాష్ర్టాలు అలర్ట్ అయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులను గమనించిన కేంద్రం రాష్ర్టాలకు గుడ్ న్యూస్ చెప్పింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద వేల కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. తక్షణ సాయం కింద కొన్ని నిధులను విడుదల చేసింది. 19 రాష్ర్టాలకు కలిపి రూ. 6194.40 కోట్లను విడుదల చేసింది. ఇందులో 4984.50 కోట్లను 15 రాష్ర్టాలకు కేటాయించింది. ఇందులో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, గోవా, హర్యానా, హిమచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ర్ట, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, త్రిపుర ఉన్నాయి. 2023-24 కు సంబంధించి ఆయా రాష్ర్టాలు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుుడు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మేఘాలయ, యూపీ రాష్ర్టాలకు రూ. 1209.60 కోట్ల చొప్పున విడుదలయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రకృతి వైపరీత్యాల సమయంలో వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిపై రాష్ర్టాలు హర్షం వ్యక్తంచేశాయి.