- సమంత కూడా సినిమా చూడాలంటూ..

Chaitu Fans Demand Samantha : తెలుగు ఇండస్ట్రీలో నాగ చైతన్య అక్కినేని యువ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఈయన వరుసగా నాలుగైదు సినిమాలతో హిట్స్ అందుకున్నాడు..దీంతో అక్కినేని హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు అని అనుకున్నారు.. అయితే గత రెండు సినిమాల నుండి ఈయన ప్లాప్ అందుకున్నాడు..
థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా వంటి ప్లాపులతో వెనుక బడ్డాడు.. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ”కస్టడీ”.. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ముందు నుండి భారీగానే క్రియేట్ అయ్యాయి..
వెంకట్ ప్రభు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు.. తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న అంటే ఈ రోజు గ్రాండ్ గా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది.. మరి ఈ క్రమంలోనే ఈ సినిమాను చూసిన నాగ చైతన్య ఫ్యాన్స్ రివ్యూ ఇచ్చారు..
అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ ఒక వింత కోరికను చెప్పుకొచ్చారు.. ఈయన ఈ సినిమాతో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు అని సినిమా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ రివ్యూ ఇచ్చారు.. ఇదే సమయంలో ఒక ఫ్యాన్స్ సమంత కోసం ఫన్నీ కోరిక కోరారు.. సమంత కూడా కస్టడీ సినిమా చూడాలని చెప్పుకొచ్చారు.. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






