
Sam Emotional : టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంత జంట అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు కలిసి ఉన్న నాలుగేళ్లు కూడా ఎంతో అన్యోన్యంగా జీవించారు. మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది.. ఇంత అందమైన జంట అనూహ్యంగా విడాకులు తీసుకోవడం ఏంటని ఇప్పటికి ఆలోచించని ఫ్యాన్స్ లేరు..
విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్న అందుకు కారణాలు తెలియక పోయిన ఇప్పటికి కూడా ఈ జంట కలిస్తే బాగుండు అని అనుకోని వారు లేరు.. కొంతమంది సామ్ ను సపోర్ట్ చేస్తే మరి కొంతమంది చైతూను సపోర్ట్ చేసారు. వీరిద్దరూ పరోక్షంగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు.. ఇదిలా ఉండగా సమంత వీరు విడిపోక ముందు చైతుపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది..
పెళ్ళికి ముందు అతనితో షాపింగ్ కు వెళ్తే అస్సలు టైం తెలిసేది కాదు.. అంత బాగా చూసుకునే వాడు.. కానీ పెళ్లి తర్వాత చైతూ చాలా మారిపోయాడు.. ఎక్కువ సేపు షాపింగ్ చేయనివ్వడం లేదు.. ఇంట్లో కూడా స్ట్రిక్ట్ గా ఉండాలని చెబుతున్నాడు..
సాయంత్రం 6 దాటినా తర్వాత సినిమాల గురించి మాట్లాడకూడదు అని రూల్ కూడా పెట్టాడు.. అయితే వ్యక్తిగత విషయాల్లో ఎలాంటి రూల్స్ పెట్టకుండా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు.. అతడు దొరకడం నా అదృష్టం అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.