
Chanakya Neethi To avoid hardships to man : ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు వివరించాడు. మన జీవితంలో ఎన్ని మైలు రాళ్లు దాటాలో కూడా సూచించాడు. మనిషికి విద్య, నాయకత్వం, నైతిక విలువల గురించి ఎన్నో రకాలుగా చెప్పాడు. జీవితంలో ఎదిగేందుకు ఎన్ని రంగాల్లో రాణించాలని చెబుతుంటాడు. ఈ నేపథ్యంలో చాణక్యుడు చెప్పిన విషయాలు పలు రకాలుగా వివరించాడు.
విద్యతోనే మనకు ఎన్నో లాభాలుంటాయి. మనిషి జీవితంలో ఎదగాలంటే విద్య తప్పనిసరి. బాగా చదువుకున్న వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా (hardship) ఎదుర్కోగల సత్తా విద్యతోనే వస్తుంది. సమాజాన్ని మార్చగల శక్తి విద్యకే ఉంటుంది. దీంతో మన ఆలోచన శక్తి పెరుగుతుంది. వ్యక్తిగత, సామాజిక పురోగతి కోసం తగిన నిర్ణయాలు తీసుకునేలా వ్యక్తులకు ప్రేరణ ఇవ్వడంలో విద్య ముఖ్యమైనది.
నాయకత్వం కూడా ప్రధానమైనది. నాయకత్వ లక్షణాలుంటే మంచి నాయకుడిగా ఎదుగుతాడు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇలా మన నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. పాలకుడు తెలివైన వాడు అయితే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. నిజాయితీతో పాలన అందిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
డబ్బు సంపాదన కూడా సరైన మార్గంలో ఉండాలి. అవినీతి, అక్రమాలతో సంపాదిస్తే దానికి గుర్తింపు ఉండదు. ఆగాన వచ్చింది భోగాన పోతుంది అంటారు. అలా మనం సంపాదించే సొమ్ము చట్టబద్ధమైనది అయి ఉండాలి. మోసంతో సంపాదిస్తే అది మీకు అనర్థాలు తెస్తుంది. దీంతో నిజాయితీతో సంపాదిస్తేనే మనకు మంచి మార్గం లభిస్తుంది.