Kavitha Bail : వచ్చే వారం ఎమ్మెల్సీ కవితకు సోమవారం బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్‌లో తెలిపారు. కవిత ఆరోగ్య పరిస్థితి సరిగా లేదన్నారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీల బరువు తగ్గింది. బెయిల్ ప్రక్రియ పూర్తవుతుందని.. వచ్చే వారం కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. కవితకు బీజేపీ బెయిల్ ఇప్పిస్తుందన్న వార్తలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇస్తుంది? ఇలాంటి వార్తలు రాసిన వారిపై లీగల్ నోటీసు పంపుతామని హెచ్చరించారు. నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. యూట్యూబ్‌లో కనిపించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వచ్చే వారం కవితకు బెయిల్ వస్తుందని కేటీఆర్ చిట్ చాట్ వేదికగా ప్రకటించడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆయన చెప్పిన మాటల ప్రకారం..సాయంత్రానికి కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో లిస్టు అయినట్లుగా బయటకు వచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవితను ఆమె అన్న కేటీఆర్ కలిశారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఆయన వెంట మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్ కూడా ఉన్నారు. కేటీఆర్, హరీశ్ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకోగా, ఇతర నేతలు ఆదివారం వచ్చారు. అయితే ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనేది మాత్రం గోప్యంగా ఉంచారు.
సోమవారం కవితతో భేటీ ఉంటుందని తొలుత వార్తలు వచ్చినా.. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై కేటీఆర్, హరీశ్ తదితరులు న్యాయ నిపుణులతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. పార్టీ మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ అధినేత ఇంట్లో ఘనంగా నిర్వహించి వీడియో సందేశం పంపారు. మరోవైపు దీనిపై ఎక్స్ స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్న సిసోడియాకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. వచ్చే వారంలోనే కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.