తనకు కలిగితే నొప్పి.. మరొకరికి కలిగితే నాటేంటి’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన పనికి చాలా వరకు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థులు తనతో మర్యాదగా ఉండాలని కోరుకుంటాం కదా.. అలాగే వారి పట్ల కూడా మనం అలాగే ఉండాలి. కానీ ఈ విషయం చంద్రబాబుకు తెలిసినట్లు లేదనుకోవాలా..? మరోలా అనుకోవాలా.? తెలియడం లేదు. గతంలో తన భార్యను ధూషించిన సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన బాబు.. ఈ మాదిరిగానే ప్రత్యర్థి కుటుంబాన్ని ధూషించిన వారిని వెన్నుతట్టి మరీ ప్రోత్సహిండంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
విదేశాలలో ఉన్న ఒక యువతి ప్రతీ రోజు వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలోని వివిధ అకౌంట్లలో అసభ్య పోస్ట్ లు పెడుతూ శునకానందం పొందుతుంది. ప్రవాసాంధ్రురాలైన ఆమెకు తగిన బుద్ధి చెప్పేందుకు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. సదరు యువతి గురించి పూర్తి కూపీ లాగింది. ఆమెను ఎలాగైనా లైవ్ లోకి వచ్చేలా చేసింది. ఇక లైవ్ లోకి వచ్చిన ఆ యువతి ఏడ్చేసింది. ఇలా చేస్తూనే జగన్ ను మళ్లీ తిడుతూ.. చంద్రబాబును అందలం ఎక్కించింది.
ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. చంద్రబాబు చెవిన చేరింది. దీంతో వేగంగా స్పందించిన సార్ సదరు యువతికి ఫోన్ చేశారు. తాను ఉన్నానని ధైర్యం చెప్పారు. అయితే సీఎం కుటుంబం పట్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం చంద్రబాబు దృష్టిలో మంచిపని కావచ్చేమో. ఇకా ఇలానే పోస్ట్ లు పెట్టాలని, తిట్టాలని కూడా సదరు యువతిని ప్రోత్సహిస్తున్నారట. పైగా భావ ప్రకటనా స్వేచ్ఛను జగన్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కూడా తీవ్రంగా మండిపడ్డారు. ‘సార్ మీరూ.. మీరూ.. తిట్టుకుంటే అదేదో రాజకీయం అవుతుంది కానీ ఇలా ఇంట్లో వాళ్లను కూడా తిట్టడం కరెక్ట్ కాదేమో.. పైగా తిట్టిన వారికి మద్దతు ఇవ్వడం మీలాంటి వారికి అస్సలు మంచిది కాదని’ కామెంట్లు వినిపిస్తున్నాయి.
పైగా, అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తూ భయపెట్టాలనుకునే వైసీపీకి ఆమె (పోకిరీ యువతి) లాంటి బలమైన శక్తుల సంకల్పాన్ని దెబ్బతీయలేవంటూ బాబు ట్వీట్ కూడా చేయడం కొసమెరుపు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మంచీ, మర్యాద లేకుండా ఇలాంటి పోకిరీలకు వత్తాసు పలకడాన్ని జనం ఛీ కొడుతున్నారు.
ReplyForward
|