
Chandrababu Arrest :
‘స్కిల్ డెవలప్‌మెంట్’ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడుకు అండగా రాష్ట్రం యావత్తు నిలుస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనను కావాలనే జైలులో పెట్టించిందని ప్రముఖులు అంటున్నారు. అసలు స్కిల్ డెవలప్ మెంట్ లో ఎటువంటి స్కాం జరగలేదని రిటైర్డ్, ప్రజెంట్ అధికారులు మొత్తు కుంటున్నా.. సీఐడీ మాత్రం జగన్ ప్రభుత్వం మాటలు వింటూ కావాలనే చంద్రబాబును ఇబ్బందుల పాలు చేస్తుందని ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి.
సీబీఐ కోర్టు తీర్పుతో జైలుకు వెళ్లిన బాబు.. అనంతరం హై కోర్టును ఆశ్రయించగా.. ఈ కేసుపై 19వ తేదీ వరకు ఎటువంటి వాదనలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసులో మంగళవారం వరకు జైలులో ఉండాల్సిందే. అయితే ఆయనకు అక్కడ సదుపాయాలు సరిగా లేవని, ఆయన ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కన్నా లక్ష్మీనారాయణ లేఖలు రాశారు. ఆయన యోగ క్షేమాలు తెలుసుకునేందుకు రాసినట్లు వారు చెప్పారు. జగన్ ప్రభుత్వం కావాలనే చంద్రబాబును జైలులో పెట్టిందని అన్నారు. అంతటి పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టడం జగన్ ప్రభుత్వానికి మంచిది కాదని వారు అన్నారు.
ఆయనకు అండగా రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీ కూడా నిలవడం ఆనందంగా ఉందని దూళిపాళ్ల, కన్నా అన్నారు. తాము కూడా చంద్రబాబు నాయుడి వెంట ఉన్నామని (I Am with CBN) వారు అన్నారు. మచ్చలేని మనిషిగా ఆయన బయటకు రావడం ఖాయమని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు.