IT Employees Car Rally :
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లడానికి ఐటీ ఉద్యోగులు కార్లతో ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి పోలీసులను మోహరించి అడ్డుకునేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఏపీ బోర్డర్ పాకిస్తాన్ బోర్డర్ గా మారిపోయింది. చుట్టు పోలీసులు మోహరించి అడుగడుగునా తనిఖీలు చేస్తున్నరు. దీంతో అక్కడి వారికి పాకిస్తాన్ లో ఉన్నామా లేక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులే దర్శనమిస్తున్నారు. ఇలా ఏపీ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది.
చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు చలో రాజమహేంద్రవరం కార్యక్రమం చేపడితే ఉద్యోగులు ఏపీలోకి అడుగు పెట్టేందుకు అర్హత లేదంటూ వందలాది మంది పోలీసులను దింపింది. తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి పడుకుంది అంటూ టీడీపీ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు రాష్ట్ర సరిహద్దు అంటూ పోలీసులు మోహరించిన ఫొటోను వీడియోలో షేర్ చేసింది.
దీంతో ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. బాబుపై పక్షపాత ధోరణిని అందరు ఎండగడుతున్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ విధానాలను టీడీపీ తప్పుపడుతోంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా జైల్లో పెట్టి తన కక్ష తీర్చుకుంటోంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.