
ఎలా అంటే… అమరావతి భూముల కేసులో ప్రస్తుతం ఏపీ సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. అమరావతి భూముల పుల్లింగ్ లో ఎన్నో అవకతవకలు జరిగాయని లీక్ లు బయటకు ఇస్తున్నారు. అయితే టీడీపీ హయాంలో తన అనుయాయులతో పాటు చంద్రబాబు కుటుంబం లబ్ధి పొందేలా పాలు లావాదేవీలు జరిగినట్లుగా ఏపీ సీఐడీతో పాటు వైసీపీ ఆరోపిస్తున్నది. అయితే కోర్టులో చార్జీషీట్ దాఖలుకు సీఐడీ సిద్ధమైంది. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ 2గా మాజీ మంత్రి నారాయణ, లింగమనేని సహా మరికొందరు పేర్లను చేర్చింది. లింగమనేని భూములకు సంబంధించి. ఆయనకు లబ్ధి చేకూర్చి ఆటు హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు పొందారని సీఐడీ ఆరోపిస్తున్నది. ఒక ఈ కేసులో ఏ1గా చంద్రబాబు పేరు ఉండడంతో వైసీపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక జగన్ మీదున్న ఏ1 ముద్రను అటు మళ్లింవచ్చని.. అనుకుంటున్నది. ఎలాగూ ఇలాంటి పనులకు ఐ ప్యాక్ టీం సిద్ధంగా ఉండనే ఉంది. మరోవైపు ఇప్పటికే అమరావతి భూముల పుల్లింగ్ లో భారీ అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ‘సాక్షి మీడియా సంస్థ కొత్త క్రొత్త కథనాలు వడ్డిస్తున్నది. అమరావతి అంశాన్ని మరుగున పడేయడానికి ఎన్నికల సమయంలో లబ్ది పొందాలని వైసీపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని టీడీపీ ఆరోపిస్తున్నది. సీఐడీని అడ్డుపెట్టుకొని కుట్రలకు తెరలేపిందని మండిపడుతున్నది. అయితే రానున్న కాలంలో ఈ కేసు చంద్రబాబును ఎంత మేర ఇబ్బంది పెడుతుందో వేచి చూడాలి.
ReplyForward
|