Angallu Case : అంగళ్లు కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది హైకోర్టు ఈ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. బాబు తరఫు న్యాయవాది వాయిదా కోరడంతో కేసు వాయిదా పడింది. ప్రభుత్వ న్యాయవాది దుష్యంత రెడ్డి కేసును గురువారానికి వాయిదా వేయమని కోరారు. దీంతో వచ్చే మంగళవారం రోజు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ ఉంటుందని బాబు తరఫు న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ కోరారు. అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు.
చంద్రబాబు ప్రాజెక్టుల యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటించినప్పుడు పుంగనూరుకు వెళ్తున్న సమయంల తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అంగళ్లు గ్రామంలో దాడులు చోటుచేసుకున్నాయి. అంగళ్లు గ్రామంలో జరిగిన దాడుల విషయంలో చంద్రబాబు పేరును ఏ వన్ గా చేర్చారు. మరో 159 మంది పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు. బాబుపై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టడం విశేషం.
మరోవైపు చంద్రబాబు జైలులో ఉండగా పవన్ కల్యాణ్, నందమూరి బాలక్రిష్ణ ములాఖత్ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు కూడా రాజకీయాలను ప్రభావితం చేశాయి. జైలు చుట్టు రాజకీయాలు జరిగాయి. చంద్రబాబు జైల్లోనే ఉంటూ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అల్లర్ల కేసుల్లో ఎక్కువ రోజులు జైల్లో ఉంచరు.
ఈనేపథ్యంలో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. ఈ సారి తనకు చివరి అవకాశం ఇవ్వాలని బాబు కోరే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజలు ఆలోచనలో పడిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా పెరుగుతోంది. దీంతో జగన్ కు చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదని ప్రజలు చెబుతున్నారు.