
Chandrababu Cartoon : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆయన అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించిన అక్కడి ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోర్టుకు తీసుకెళ్తుండగా అడ్డుకునేందుకు యత్నించారు. ఆయన అరెస్ట్ అయ్యారన్న వార్తతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ రోట్ల మీదకు వచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సరికాదని మండిపడ్డారు.
అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలో సైతం నాయకులు నిరసన బాట పట్టారు. హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మొదటి సారి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్ట్. ఒక ప్రజా నాయకుడిని అరెస్ట్ చేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇలా రోడ్లపైకి రావడం ఇదే ప్రథమం. వారితో పాటు దేశంలోని ప్రముఖులు సైతం ఆయన అరెస్ట్ పై స్పందించారు. తమిళ నటుడు రజనీకాంత్ సైతం చంద్రబాబు తనకు ఫ్రెండ్ అని నారా లోకేశ్ కు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆయనతో పాటు దేశంలోని చాలా మంది ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు.
సోషల్ మీడియా నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంపై వార్ కొనసాగుతోంది. చంద్రబాబు అభిమానులు, టీడీపీ నేతలు, ఎన్ఆర్ఐలు వైఎస్ జగన్ పై భగ్గుమంటున్నారు. అనేక విధాలుగా తమ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
క్యూబా పోరాట యోధుడు ఫిడేట్ కాస్ట్రో చెప్పినట్లు ‘నేరస్తులు పాలకులైతే నీతి మంతులు జైళ్లలో మగ్గుతారన్న’ సత్యం జగన్, చంద్రబాబు కు పర్ఫెక్ట గా నప్పుతుందని తెలుస్తోంది. మహాత్ముడు గాంధీ చెప్పినట్లు ’మూర్ఖులతో పోరాడేప్పుడు మరింత సహనం అవసరం’ అదే విధంగా ప్రస్తుం చంద్రబాబు నాయుడు సహనంతో వ్యవహరిస్తున్నారు. నిజాయితీగా రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన టిడిపి అధినేత చంద్రబాబుని రాజకీయ కక్షతో జైలుకి సైకో జగన్ పంపినా.. బాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారు. ఎందుకంటే ఆయన గాంధేయవాది, ప్రజాస్వామ్య ప్రేమికుడు. తప్పుచేయని నిప్పులాంటి నేత.