Chandrababu Custody : చంద్రబాబు కస్టడీలో కీలక విషయాలు తేలనున్నాయి. ఈ రోజు విచారణకు హాజరుకానున్న చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టడానికి సీఐడీ రెడీ అవుతోంది. ప్రధానంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో A38 ఎవరు అన్నది కీలకంగా మారింది. మరిన్ని కేసుల్లో ఇంకో అరెస్ట్ చేయడానికి సీఐడీ రెడీ అవుతున్నట్టు సమాచారం.
చంద్రబాబును సీఐడీ అడిగే అతి కీలక ప్రశ్న ఇదేనా ?
చంద్రబాబును కస్టడీకి తీసుకున్న సీఐడీ ఆయనను కీలక ప్రశ్న అడిగేందుకు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘స్కిల్ డెవలప్ మెంట్’ కేసులో నిధులు ఎటు మళ్లించారనే ప్రశ్న అడగనుంది. దీంతో పాటు ఈ స్కాంలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా ప్రశ్నించనున్నారు. ఏ37 చంద్రబాబు అయితే ఏ38 ఎవరనేది ప్రముఖంగా ప్రస్తావనలోకి వస్తుంది.
ఆర్డర్ కాపీలో ఏముందంటే..
చంద్రబాబు ఏ37, ఏ1 గంటా సుబ్బారావు ఏ2 లక్ష్మీ నారాయణ మిగిలిన వారితో అంటే ఏ6 , ఏ8 కుమ్మక్కై ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఎస్టిమేట్ సపోర్టింగ్ బిల్స్ లేకుండా కేబినెట్ జరిగే ఒక రోజు ముందు అంటే 15 ఫిబ్రవరి, 2015న ఏదో డ్రాఫ్ట్ తయారు చేసి దానినే ఏ37 అయిన చంద్రబాబు అధ్యక్షతన కాబినెట్ తో టేబుల్ టైమ్ గా చేర్చారు. ఇది ఏ37 అండ్ ఏ38 విమ్స్ అండ్ విషెస్ (కోరికలు మరియి అభిలాష) కోరిక మేరకు చేర్చారు .
దీనిని కాబినెట్ ఏ37 చంద్రబాబు సూచనల (instructions) మేరకు కాబినెట్ ఎలాంటి ప్రామాణికాన్ని కాదా బ్యాక్ అండ్ చెక్ లేకుండా, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ లేకుండా, లేదా థర్డ్ పార్టీ చెక్ లేకుండా టెండర్ ప్రాజెస్ లేకుండా 90 శాతం, 10 శాతం అనే నామినేషన్ మీద కేటాయించారు. ఈ మొత్తం తతంగంలో ఏ38 ఎవరనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది.