22.4 C
India
Thursday, September 19, 2024
More

    Outer Ring Road : చంద్రబాబు నాయుడి చలువే ఔటర్ రింగ్ రోడ్డు.. ఆయన హయాంలోనే సర్వే పూర్తి

    Date:

    Outer Ring Road
    Outer Ring Road
    Outer Ring Road : ‘ఔటర్ రింగ్ రోడ్’ ఇది హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న ఎక్స్ ప్రెస్ వే.. అసలు దీని రూపకర్త, నిర్మాత ఎవరని ప్రస్తుతం సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీని గురించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చల్లో నిలుస్తుంది. ఎనిమిది వరుసలు ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ వేను చంద్రబాబు నాయుడు డిజైన్ చేశారు. ఆయన హాయంలోనే దీనికి బీజం పడింది. హైదరాబాద్ ను ప్రపంచంలోనే ఐటీకి అతిపెద్ద కేంద్రంగా నిర్మించాలని ఆయన కలలు కన్నాడు. ఈ నేపథ్యంలో హైటెక్ సిటీని నిర్మించాడు.
    ఇక, హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ కు అవసరమైన ఇన్ఫ్రా స్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు 2001లో చంద్రబాబు నాయుడు ఇన్ సెట్ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ కు ఎండీగా లక్ష్మీ పార్థసారధి వ్యవహరించారు. ఆయన ఏ పార్టీకి తలొగ్గకుండా.. ఎవరికీ ఇబ్బంది లేకుండా రోడ్డు కోసం సర్వే పూర్తి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పారు. అన్నీ కలిసి రావడంతో 2006లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రోడ్డు నిర్మాణానికి పునాధి రాయి వేశారు.
    ఈ భారీ రింగ్ రోడ్డు 2008లో ప్రారంభం కాగా.. 2016లో పూర్తయ్యింది. ఇది ఇండియాలోనే అతిపెద్ద ఎక్స్ ప్రెస్ వే. ఈ రోడ్డుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 5 జిల్లాలను కలుపుతుంది. నేషనల్ హైవేలను కలుపుతుంది. రాష్ట్ర హైవేలను కూడా కలుపుతుంది. అర్బన్ ప్రాంతాలైన హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లను కలుపుతుంది. ప్రస్తుతం తెలంగాణ జీడీపీలో 75 శాతం ఈఐటర్ రింగ్ రోడ్డు నుంచే వస్తుందట. ఈ రింగ్ రోడ్డు సృష్టికర్త చంద్రబాబు మాత్రమే అన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    NRI TDP donates : వరద బాధితుల కోసం ఎన్ఆర్ఐ టీడీపీ విరాళం.. సీఎం సహాయ నిధికి ఎంత అందజేసిందంటే?

    NRI TDP donates : ఎదుటి వ్యక్తికి కష్టం వచ్చిందంటే చాలు...

    High Court : బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చండి.. హైకోర్టు కీల‌క ఆదేశాలు

    High Court Order : భారత రాష్ట్ర సమితికి సంబంధించి పార్టీ...

    Jamili : జమిలికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం.. 3.0లోనే అమలుకు శ్రీకారం..

    Jamili Elections : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి...

    Balineni Srinivas : వైసీపీకి బిగ్ షాకిచ్చిన బాలినేని.. ఇక ఆయన దారెటు ?

    Balineni Srinivas Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related