
Chandrababu Naidu : భాష కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం రాదని CM చంద్రబాబు అన్నారు. ‘మాతృభాషతోనే విజ్ఞానం వస్తుంది. భాషపై లేనిపోని రాజకీయాలు చేయం. బతుకుదెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకుంటాం. కానీ మాతృభాషను మరిచిపోకూడదు’ అని తెలిపారు. మరోవైపు, ధ్వంసమైన రాష్ట్రాన్ని ట్రాక్‌లో పెట్టామన్నారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడం ఖాయమని వివరించారు.