
Chandrababu : NDA ప్రభుత్వంలో AP CM చంద్రబాబు కీలకమనే విషయం తెలిసిందే. ఆయన లేకుంటే ఏకంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. దీంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. ఇటీవల మిర్చి పంటల ధరలకు సంబంధించి ఆయన కేంద్రానికి లేఖ రాయగా.. కేంద్రం సానుకూలంగా స్పందించింది. అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధులు తెచ్చుకోవడంలో CBN సక్సెస్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.