41.7 C
India
Thursday, May 14, 2026
More

    Chandrababu : వీళ్లను కలిసేందుకు నిరాకరించిన బాబు.. కారణం ఇదేనా?

    Date:

    Chandrababu
    Chandrababu refused to meet these officers

    Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, కాబోయే ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన వివాదాస్పద ఐపీఎస్ కు అుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. విజయంతో మర్యాద పూర్వకంగా కలుస్తామని రాగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

    బాబును కలిసేందుకు సీఐడీ చీఫ్‌ సంజయ్‌ వచ్చారు. కానీ, కరకట్ట గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపి వెనక్కి పింపించారు. బాబుపై అక్రమ కేసులు నమోదులో సంజయ్‌ కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అయితే, ఫలితాల్లో బాబు విజయం సాధించడంతో సెలవు పెట్టి విదేశాలకు వెళ్లాలని సీఐడీ చీఫ్ సంజయ్ అనుకున్నారు. కానీ అందుకు బాబు అంగీకరించకపోవడంతో సెలవు క్యాన్సిల్ చేశారు. మర్యాద పూర్వకంగా కలిసేందుకు సంజయ్‌ వచ్చాడని విషయాన్ని అధికారులకు గేటు సిబ్బంది చెప్పారు. అనుమతి లేదని చెప్పడంతో వెనక్కి పంపారు.

    మరో అధికారి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం (జూన్ 06) ఉదయం ఉండవల్లిలోని బాబు నివాసం వద్దకు వచ్చారు. ఆయనకు కూడా చంద్రబాబు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఈసీ ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో పాటు అనధికారికంగా వైసీపీకి కోసం పనిచేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బాబు నివాసం ప్రధాన గేటు వద్దే పీఎస్‌ఆర్‌ కారు సిబ్బంది ఆపారు. అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.

    మరో సీనియర్‌ ఐపీఎస్‌ కొల్లి రఘురామిరెడ్డికి కూడా అనుమతి ఇవ్వలేదు. అనుమతి కోసం సంబంధిత అధికారులకు ఫోన్ చేయగా తిరస్కరించారు. నంద్యాలలో బాబు అరెస్ట్‌ సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి విధేయుడిగా పని చేశారంటూ  ఈసీ కొరఢా ఝుళిపించింది. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఈసీ ఆదేశించింది.

    గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిదీ ఇదే పరిస్థితి వైసీపీకి తొత్తుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. బాబును కలిసేందుకు వెళ్లగా అనుమతి లేదని పోలీసులు ఆయన కారును ఆపారు. దీంతో వెనుదిరిగారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...