20 C
India
Saturday, January 17, 2026
More

    Chandrababu : చంద్రబాబు సూపర్ విక్టరీ..దూసుకెళ్తున్న ఆంధ్రా కంపెనీల షేర్లు

    Date:

    Chandrababu
    Chandrababu

    Chandrababu Victory : చంద్రబాబు ట్రెమండస్ విక్టరీ..ఏపీకి ఎవరూ ఊహించిని పాజిటివ్ వైబ్స్ ను తీసుకొస్తుంది.  ఒక్క ఎలక్షన్..చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  తెలుగు దేశం పార్టీకి వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. చంద్రబాబు నాయుడిని మరోసారి జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా నిలిపింది. ఇప్పుడు దేశమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది. ఆకాశమంత విజయాన్ని కట్టబెట్టి చంద్రబాబుకు మరోసారి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారు ఏపీ ప్రజలు. చంద్రబాబు పనితనం, సమర్థత, దార్శనికత, కార్యదక్షత, రాజకీయ చతురతపై జాతీయ మీడియాలో కథనాలు వెల్లువలా వస్తున్నాయి.

    ఇదే తరుణంలో ఏపీలో చంద్రబాబు భారీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే వేళ.. ఆంధ్రా కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. గత నాలుగు సెషన్లలో కేసీపీ స్టాక్స్ 50శాతం, అమరరాజా 32శాతం, ఆంధ్రా షుగర్స్ 21శాతం, అవంతీ సీడ్స్ 28శాతం, లారస్ ల్యాబ్ 10 శాతం, నెల్కాస్ట్ అడ్వాన్సింగ్ 13శాతం వృద్ధి చెందాయి. మరో వైపు కల్లం టెక్స్ టైల్స్ 19 శాతం, విరాట్ క్రేన్ ఇండస్ట్రీస్ 23 శాతం, ఆంధ్రా సిమెంట్స్ 24 శాతం, క్రేన్ ఇన్ఫాస్ట్రక్చర్ 40 శాతం, ఆంధ్రా పెట్రోకెమికల్ షేర్లు 32 శాతం పెరిగాయి.

    ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. ఈ స్టాక్ వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొడుతూనే ఉంది. దీంతో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులకు మాత్రమే కాదు.. కంపెనీలో వాటాలు ఉన్న చంద్రబాబు ఫ్యామిలీకి కూడా సంపద భారీగానే వస్తోంది. హెరిటేజ్ కంపెనీలో నారా ఫ్యామిలీకి 35.7శాతం వాటా ఉంది. ఇందులో ఆయన సతీమణి భువనేశ్వరికి, కుమారుడు లోకేశ్ కు, కోడలు బ్రాహ్మణికి, మనవడు దేవాన్ష్ కు కూడా వాటాలు ఉండడం విశేషం. మొత్తంగా 6 సెషన్లలో నారా ఫ్యామిలీకి రూ.1100కోట్ల సంపద పెరగడం విశేషం.

    చంద్రబాబు అద్భుత విజయంతో ఆంధ్రా కంపెనీల దూసుకెళ్తుండగా..గతంలో జగన్ పాలనలో ఆంధ్రా కంపెనీలకు ఏ మాత్రం ప్రోత్సాహం లభించింది. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సాహించకపోగా వారిని చాలా వేధించింది. గల్లా జయదేవ్ లాంటి మంచి పేరున్న పారిశ్రామికవేత్తను అయితే చాలా ఇబ్బందులు పెట్టింది. చివరకు ఆయన తన పరిశ్రమను తెలంగాణలో స్థాపించవల్సి వచ్చింది. ఏపీలో అన్ని రంగాలను కుదేలు చేసిన జగన్ రెడ్డికి ఏపీ ప్రజలు తగిన బుద్ధి చెప్పి పరిపాలన దక్షుడైన చంద్రబాబుకు అధికారం అప్పగించారు. దీంతో ఏపీపై దేశమంతట సానుకూల ధోరణి కన్పిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...