25.2 C
India
Tuesday, January 20, 2026
More

    Chandrababu : చంద్రబాబుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం వైరల్ వీడియో

    Date:

     

    Chandrababu
    Chandra Babu

    Chandrababu : ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ క్యాడర్ ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ పర్యటన ముగించుకొని బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును ఇక్కడి నేతలు తొలుత గజమాలతో సత్కరించారు. అనంతరం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. సన్‌రూఫ్‌ కారు నుంచి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

    సాయంత్రం సుమారు 4 గంటల నుంచే ఎయిర్ పోర్ట్కు వేలాదిగా చేరుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులతో బేగంపేట పరిసరాలు పసుపు రంగు అద్దుకున్నాయి. రాత్రి ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రాయానికి వచ్చిన బాబుకి పార్టీ నేతలు బొకేలతో స్వాగతం పలికారు. అనంతరం బైక్ లు, కార్లతో భారీగా ర్యాలీ చేపట్టారు. బేగంపేటలో జోరు వాన కురుస్తున్నా లెక్కచేయని కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. జూబ్లిహిల్స్‌లోని, ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌కు బాబు చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. దారి పొడవునా తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో వేచి ఉండి స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

    కాగా, నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ  జరగనుంది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటలు జరిగే సమావేశానికి, పది ప్రధాన అంశాలతో ఎజెండా సిద్ధం చేశారు. తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల పంపిణీతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు.

    కాగా, చంద్రబాబుకు తెలంగాణలో ఘన స్వాగతం పలుకడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పార్టీకి మంచి రోజులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబుకు ఘన స్వాగతం వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Jogi Ramesh : జోగి రమేష్‌పై ఉచ్చు బిగుస్తోందా?

    Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయ దూకుడే ఇప్పుడు...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్ ఖేల్ ఖతమైనట్టేనా?

    Sajjala Bhargav : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డికి...

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...