
Chandrababu :
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యాడు. కొంత కాలంగా చంద్రబాబును వైసీపీ నాయకులు విసిగిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో బాబుకు వ్యతిరేకంగా విపరీతమైన పోస్టులు వెలుస్తున్నాయి. టీడీపీకి సపోర్ట్ గా సోషల్ మీడియా కేంద్రంగా పని చేస్తున్న యువతిని వైసీపీ నాయకులు ఆడుకున్నారు. దీంతో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చంద్రబాబుకు కంప్లయింట్ చేసింది. దీనిపై బాబు బాగానే స్పందించారు. వాక్ స్వతంత్ర్యాన్ని కాల రాస్తున్నారని మండిపడ్డారు. ఇలా అయితే ప్రజాస్వామ్యం ఏమై పోతుందని పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
‘నేను ఒకటే వైఎస్సార్ నాయకులను అడుగుతన్నా.. మీరు తిడతారని నాకు తెలుసు, మీరు ప్రస్టేషన్ లో ఉన్నారని నాకు తెలుసు. ఎక్స్పయిరీ డేట్ వచ్చేసింది. ఎగిరెగిరి పడుతున్నారు. ఎం ఎగిరెగిరి పడకండి.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడక్కర్లే.. మీకు తగిన చోటు చూపిస్తాం. ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కేసులు పెడితే భయపడతారనో.. రౌడీయిజం చేస్తే భయపడతారనో.. ఓట్లు మ్యానిప్లికేట్ చేస్తామనుకొనో.. దొంగ ఓట్లు వేసే ప్రతి ఒక్కరికీ చెప్తున్నా.. అన్నీ కంట్రోల్ చేస్తాం. నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం కోసం, భావితరాల భవిష్యత్ కోసం కష్టపడుతున్నాం.. అభివృద్ధి చేసిన పార్టీ, సంక్షేమాన్ని ఇచ్చిన పార్టీ, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన పార్టీ. తెలుగు జాతి శక్తిని ప్రపంచానికి చాటిన పార్టీ తెలుగుదేశం’ అని చెప్పారు.
.
ఏపీలో వైఎస్ జగన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకున్నా.. చంద్రబాబు మాత్రం త్వరలో వచ్చేది తమ ప్రభుత్వమే అని చెప్పడం కొంత హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గత ఐదేళ్లు సీఎంగా చేసిన ఆయన తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఏపీలో స్ట్రాంగైన ప్రతిపక్ష పాత్ర లో కూడా లేకుండా పోయింది. ఇంత పరాభవం ఎదుర్కొన్నా చంద్రబాబు మాత్రం తనలోని ఇంకా సీఎం ఆకాంక్షను వదులుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాబు వార్నింగ్ తో వైసీపీతో పాటు టీడీపీ నాయకులు కూడా నవ్వు కుంటున్నారు.






