BJP states.: బీజేపీ పలు రాష్ట్రాల్లో తమ పార్టీ అధ్యక్షులను మార్చబోతున్నది. ఎన్నికల ముందు పార్టీలో కీలక మార్పులు సహజమే అయినా ఈ సారి ఏకంగా పార్టీ అధ్యక్షుల మార్పు అంశం సీరియస్ గా సాగుతున్నది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ర్టాల అధ్యక్షుల అంశం కొన్నాళ్లుగా మీడియా ప్రచారంలో ఉన్న అంశమే. ఇక తెలంగాణ లో బండిసంజయ్ ని మారుస్తారని, అటు ఏపీలో సోము వీర్రాజును తొలగిస్తారని ఇలా ఎన్నో కథనాలు మీడియాలో గతంలోనూ వచ్చాయి. అయితే ఈసారి మాత్రం సీరియస్ గా ఈ చర్చ కొనసాగుతున్నది.
తెలంగాణలో పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే ఇటీవల పార్టీ అధ్యక్ష మార్పు తెరపైకి వచ్చింది. ఇప్పటికే పార్టీనేతలు ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ అంశంపై అగ్రనేతలతో మాట్లాడారు. మరోవైపు తాజాగా రఘునందన్ రావు కూడా తనకు అధ్యక్ష పదవి లేదా శాసనసభ పక్ష నేత పదవిలో ఏదైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి.. కిషన్ రెడ్డికి రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు బీసీని కాదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే తెలంగాణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నం బీజేపీ చేస్తుందా అనేది అనుమానమే. రెడ్డి సామాజిక వర్గమంతా రేవంత్ రెడ్డిని కొంత ఓన్ చేసుకున్నట్లుగా కనిపిస్తున్నది. కొంతకాలంగా వెల్మల పార్టీగా బీఆర్ఎస్ కు దూరమవుతూ వస్తున్న రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు బీజేపీ పగ్గాలు అప్పగిస్తే రాష్ర్టంలో ఒరిగేదెమీ లేదు.ఇటు బీసీ నేతగా ఉన్న ఈటెల రాజేందర్ కు అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. బీఆర్ఎస్ ను గద్దె దించాలనే సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఈ సమయంలో ఆయనైతేనే కరెక్ట్ అని అభిప్రాయం బయటకు వస్తున్నది.
మరోవైపు ఏపీలో అధ్యక్ష మార్పు ఖాయంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు అక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు. కమ్మల చూపంతా టీడీపీ పై ఉంది. ఇక రెడ్లు ఎలాగూ జగన్ వైపే ఉంటారని బీజేపీ భావిస్తున్నది. ఇలాంటి సమయంలో కాపులను ఆకర్షించేలా సోము వీర్రాజును తెరపైకి తెచ్చింది. కానీ ఇప్పుడు కాపులంతా పవన్ వైపు చూస్తున్నారు. పవన్ ఎలాగూ తమకు మిత్రుడిగానే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం పై పోరాడడం, పార్టీని బలోపేతం చేయడంలాంటి అంశాల్లో సోము వీర్రాజు విఫలమవుతూ వస్తున్నారు. ఆయన జగన్ కు అనుకూలంగా ఉంటున్నారనే చర్చ కూడా గతంలో ఏపీలో జరిగింది. ఇలాంటి సమయంలో ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అధ్యక్షులను మార్చకుంటే తమ ఉనికి పూర్తిగా తెలుగు రాష్ర్టాల్లో కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నది. అందుకే రెండు తెలుగు రాష్ర్టాల్లో రోజుకో పేరును తెరపైకి తెస్తూ శ్రేణుల నాడి పట్టే ప్రయత్నం చేస్తున్నది. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది.
ReplyForward
|