Charming looks of Rashmi :
బుల్లితెర వ్యాఖ్యాతల్లో రష్మీకి ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో తెలిసిందే. ఆమె తన అందంతో అందరిని మంత్రముగ్దులను చేస్తోంది. స్టార్ యాంకర్ గా పేరుతెచ్చుకుంది. కేవలం రష్మీ కోసమే జబర్దస్త్ చూసే వారున్నారంటే అతి శయోక్తి కాదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా రష్మీ అదరగొడుతోంది. తన అందంతో అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో అందరిని ఆకర్షిస్తోంది. తాజాగా వర్చుల్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తోంది.
అనసూయ, రష్మీ ఇద్దరు కలిసి జబర్దస్త్ ను చాలా రోజులు ముందుకు నడిపించినా మధ్యలో అనసూయ జబర్దస్త్ కు టాటా చెప్పేసింది. ప్రస్తుతం సినిమాలకే అంకితమైపోయింది. ఇప్పుడు రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో వ్యాఖ్యాతగా ఉంటోంది. రష్మీ అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అంతటి అందం ఆమె సొంతం.
వీరి డ్రెస్సింగ్ గురించి చాలా విమర్శలు వచ్చినా వారి అలవాట్లు మాత్రం మార్చుకోలేదు. యాంకర్లంటే నిలువెల్లా దుస్తులు వేసుకోవాలనే సంప్రదాయానికి వీరు చెక్ పెట్టేశారు. రష్మీ గుంటూరు టాకీస్ సినిమాలో నటించింది. తరువాత కొన్ని చిన్న పాత్రలు చేసినా ఎందుకో సినిమా రంగం నుంచి తప్పుకుంది. ప్రస్తుతం బుల్లితెరనే నమ్ముకుంది. అత్యధిక పారితోషికం అందుకునే యాంకర్లలో ఒకరిగా నిలుస్తోంది.
2013లో ప్రారంభమైన జబర్దస్త్ తో యాంకర్ అవతారమెత్తిన అనసూయ దూరం కావడంతో ఇక రష్మీ కి ఎదురు లేకుండా పోయింది. కానీ మధ్యలో సౌమ్యరావు ఎంట్రీతో రష్మీ మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్ కే పరిమితమైంది. సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం ఉందని అనిపించినా నిజజీవితంలో మాత్రం వారిది ప్రేమ కాదని అందరు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రష్మీకూడా పెళ్లి మాట ఎత్తితే దాటవేసే ధోరణి ప్రదర్శిస్తుంటుంది. కలల రాణి రష్మీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అని అందరు చూస్తున్నారు.