
Check gas problem : ప్రస్తుతం చాలా మంది గ్రాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఉదయం లేచింది పడుకునే వరకు మనం తీసుకునే ఆహారాలు కూడా సక్రమంగా ఉండటం లేదు. అందుకే మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడం లేదు. దీంతో గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దీన్ని దూరం చేసుకోవాలంటే ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కా ఉంది. దాన్ని అనుసరిస్తే మనకు గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
మనం ఏంచేయాలంటే ఓ రెండు స్పూన్ల అల్లం రసం, రెండు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు ఇంగువ, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే ఈ గ్యాస్ సమస్య లేకుండా పోతుంది. దీంతో మనకు చాలా లాభాలున్నాయి. ఈ చిట్కా ఓ సారి పాటించి చూడండి. దాని ఫలితం మీకే తెలుస్తుంది.
గ్యాస్ సమస్య నుంచి దూరం కావడానికి రకరకాల మందులు మింగుతున్నాం. కడుపంతా కీకారణ్యం చేసుకుంటున్నాం. దీంతో మనకు చాలా ఇబ్బందులొస్తున్నాయి. అందుకే ఈ చిట్కాను ఓసారి పరిశీలించండి. గ్యాస్ ట్రబుల్ పోకపోతే అప్పుడు ఆలోచించండి.
ఇలా ఆయుర్వేదంలో మనకు ఎన్నో చిట్కాలున్నాయి. ఇవన్ని మనకు ఇంట్లో దొరికే వస్తువులే. వేటికి కూడా ఎక్కువ ఖర్చు లేదు. సులభంగా లభించే పదార్థాలే కావడంతో ఓ సారి ప్రయత్నించి గ్యాస్ సమస్యను దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.