
Baldness problem : ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్య బట్టతల. ఒకప్పుడు యాబై ఏళ్లు దాటిన వారికే కనిపించే ప్రాబ్లమ్ ఇప్పుడు పాతికేళ్లకే కనిపిస్తోంది. దీంతో నలుగురిలో తిరగలేకపోతున్నారు. కాలుష్యంతో పాటు మన ఆహార విధానాలు, జీవనశైలి బట్టతల రావడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. దీని వల్ల జుట్టు సమస్యతో సతమతమవుతున్నారు. బట్టతలను ఎలా దూరం చేసుకోవాలని ఆలోచనలో పడిపోతున్నారు.
బట్టతలకు బీట్ రూట్ ఓ చక్కనైన పరిష్కారం చూపుతుంది. దీంతో బట్టతలకు చెక్ పెట్టొచ్చు. బీట్ రూట్ తో తయారు చేసే హెయిర్ ప్యాక్ గా వాడితే మంచి లాభాలు ఉంటాయి. బీట్ రూట్ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి బీట్ రూట్ రసం అరకప్పు, అల్లం రసం రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.
బీట్ రూట్ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకుని అందులో అరకప్పు బీట్ రూట్ రసం వేసుకోవాలి. తరువాత రెండు చెంచాల అల్లం రసం కలుపుకోవాలి. తరువాత అందుల రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి. వీటితో బీట్ రూట్ హెయిర్ ప్యాక్ తయారవుతుంది. ఇలా బీట్ రూట్ తో మనకు చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.
బీట్ రూట్ హెయిర్ ప్యాక్ ను వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు, తలపై కొద్దిగా మసాజ్ చేసి 20 నిమిషాల పాటు ఉంచుకుని తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బట్టతల సమస్య లేకుండా పోతుంది. జుట్టురాలడం ఆగుతుంది. వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది. ఇలా బట్టతల సమస్యకు పరిష్కారం పొందవచ్చు.